ఆలోచనల అవసరం లేకుండా లక్షల రిక్వెస్టులను అలవోకగా
పరిష్కరించే ఆర్పీఏకి ఆదరణ పెరుగుతోంది.
కొత్త దశాబ్దంలో దీనికి ఆర్టిఫిషియల్
ఇంటలిజెన్స్ తోడై యంత్రాలే నిర్ణయాలు తీసేసుకుంటాయి. పనుల వేగం
పదుల రెట్లు
పెరుగుతుంది. ఎన్నో రంగాలపై దీని ప్రభావం పడనుంది. అందుకే ఇరవై ఇరవై నుంచి కొన్ని రకాల కొలువులకు డిమాండ్ ఎక్కువకాబోతోందని అంచనా. అవసరమైన నైపుణ్యాలను
పెంపొందించుకుంటే కొన్నేళ్లపాటు నిలకడగా ఉండే ఆ అవకాశాలను
అందుకోవచ్చు.ఆటోమేషన్కు ఆదరణ ఎక్కువవుతున్న కొద్దీ యంత్రాలతో వ్యక్తులకు పోటీ పెరుగుతోంది. దీంతో
సాంకేతిక రంగంలో ఎన్నో కెరియర్లు పుట్టుకొస్తున్నాయి. ఈ విషయాన్నే లింక్‌డిన్
ధ్రువీకరిస్తోంది. 2015-19 మధ్య కాలంలో జరిగిన నియామకాల ఆధారంగా ఈ సంస్థ నివేదికను రూపొందించింది. కొత్త సంవత్సరంలో డిమాండ్ పెరగనున్న కొలువుల జాబితాను
వెలువరించింద
ఎమర్జింగ్ జాబ్స్ 2020
ఆలోచనల అవసరం లేకుండా లక్షల రిక్వెస్టులను అలవోకగా పరిష్కరించే ఆర్పీఏకి ఆదరణ పెరుగుతోంది. కొత్త దశాబ్దంలో దీనికి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తోడై యంత్రాలే నిర్ణయాలు తీసేసుకుంటాయి. పనుల వేగం పదుల రెట్లు పెరుగుతుంది. ఎన్నో రంగాలపై దీని ప్రభావం పడనుంది. అందుకే ఇరవై ఇరవై నుంచి కొన్ని రకాల కొలువులకు డిమాండ్ ఎక్కువకాబోతోందని అంచనా. అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకుంటే కొన్నేళ్లపాటు నిలకడగా ఉండే ఆ అవకాశాలను అందుకోవచ్చు.
ఆటోమేషన్కు ఆదరణ ఎక్కువవుతున్న కొద్దీ యంత్రాలతో వ్యక్తులకు పోటీ పెరుగుతోంది. దీంతో సాంకేతిక రంగంలో ఎన్నో కెరియర్లు పుట్టుకొస్తున్నాయి. ఈ విషయాన్నే లింక్డిన్ధ్రువీకరిస్తోంది. 2015-19 మధ్య కాలంలో జరిగిన నియామకాల ఆధారంగా ఈ సంస్థ నివేదికను రూపొందించింది. కొత్త సంవత్సరంలో డిమాండ్ పెరగనున్న కొలువుల జాబితాను వెలువరించింది.
బ్లాక్‌చెయిన్ డెవలపర్
ఇంటర్నెట్ యుగంలో సమాచారాన్ని దొంగిలించడం, నాశనం చేయడం మామూలే. ఇది కొన్నిసార్లు భారీ నష్టాలకు కారణమవుతుంది. భద్రతకూ ముప్పును తీసుకొస్తుంది. వీటన్నింటికీ కళ్లెం వేసేదే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ. ఇది సమాచారాన్ని వివిధ బ్లాకుల్లో నిక్షిప్తం చేసి, సురక్షితంగా ఉంచుతుంది. ఈ ప్రక్రియకు సాయపడేవారే బ్లాక్‌చెయిన్ డెవలపర్లు. వీరిలో కోర్ డెవలపర్లు బ్లాక్‌చెయిన్ సిస్టమ్ ఆర్కిటెక్చర్‌ను, ప్రొటోకాల్స్, సెక్యూరిటీ పాటర్న్లను నిర్మిస్తారు. సాఫ్ట్వేర్ డెవలపర్లు దానిని ఉపయోగించి అప్లికేషన్లు, ఆప్లు మొదలైన వాటిని రూపొందిస్తారు.
కావాల్సిన నైపుణ్యాలు: హైపర్లెడ్జర్, సాలిడిటీ, నోడ్.జేఎస్, స్మార్ట్ కాంట్రాక్ట్
కోర్సులు: లర్నింగ్ ఫుల్ స్టాక్ జావాస్క్రిప్ట్ డెవలప్మెంట్; మాంగోడీబీ, నోడ్ అండ్ రియాక్ట్; లర్నింగ్ గో; పైథాన్ ఫర్ డేటాసైన్స్ ఎసెన్షియల్ ట్రెయినింగ్; కోడ్ క్లినిక్: గోఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ స్పెషలిస్ట్
కొన్ని మినహా దాదాపుగా అన్ని రంగాల్లోకి ఏఐ/ రోబోట్లు రానున్నాయి. ఇవి సమాచారాన్ని ఉత్పత్తి చేయడమే కాదు, దాన్ని విశ్లేషించి, లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన నిర్ణయాలూ తీసుకుంటాయి. ఈ నిపుణులు స్వయంగా నిర్ణయాలు తీసుకునే మెషిన్లను రూపొందిస్తారు.
కావాల్సిన నైపుణ్యాలు: మెషిన్ లర్నింగ్, డీప్ లర్నింగ్, టెన్సర్ఫ్లో, పైథాన్ (ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్), నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ)
కావాల్సిన నైపుణ్యాలు: మెషిన్ లర్నింగ్, డీప్ లర్నింగ్, టెన్సర్ఫ్లో, పైథాన్ (ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్), నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ)
కోర్సులు: పైథాన్ ఫర్ డేటాసైన్స్ ఎసెన్షియల్ లర్నింగ్; ఫైథాన్: డిజైనింగ్ పాటర్న్స్; మెషిన్ లర్నింగ్ అండ్ ఏఐ ఫౌండేషన్స్: రెకమెండేషన్స్; పైథాన్: ప్రోగ్రామింగ్ ఎఫిషియెంట్లీ; పైథాన్: డేటా అనలిస్ట్; లర్నింగ్ హడూప్
జావా స్క్రిప్ట్ డెవలపర్
ఏదైనా వెబ్సైట్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దేవారిని ఫ్రంట్ ఎండ్ డెవలపర్లు అంటారు. చూడటానికి ఎలా ఉండాలన్న దానిపైనే వీరు పనిచేస్తే.. జావాస్క్రిప్ట్ డెవలపర్లు ఫ్రంట్ ఎండ్ లాజిక్ అమలయ్యేలా చూస్తారు. వెబ్సైట్ ప్రోగ్రామింగ్, డెవలప్మెంట్, దాని కోర్ అంశాలను అమలుపరచడం వీరి విధులు.
కావాల్సిన నైపుణ్యాలు: ఆంగ్యులర్జేఎస్, నోడ్.జేఎస్, రియాక్ట్.జేఎస్, రియాక్ట్ నేటివ్, మాంగోడీబీ
కావాల్సిన నైపుణ్యాలు: ఆంగ్యులర్జేఎస్, నోడ్.జేఎస్, రియాక్ట్.జేఎస్, రియాక్ట్ నేటివ్, మాంగోడీబీ
కోర్సులు: లర్నింగ్ ఫుల్ స్టాక్ జావాస్క్రిప్ట్ డెవలప్మెంట్: మాంగోడీబీ, నోడ్, రియాక్ట్; లర్నింగ్ ఈసీఎంఏ స్క్రిప్ట్-6; లర్నింగ్ రీడక్స్; వెబ్ డెవలప్మెంట్ ఫౌండేషన్స్: ఫుల్ స్టాక్ వర్సెస్ ఫ్రంట్ ఎండ్; లర్నింగ్ గ్రాఫ్‌క్యూఎల్.
రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ కన్సల్టెంట్
రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్పీఏ) అంటే వ్యక్తులు చేసే రొటీన్ పనులను రోబోలు నిర్వహించేలా రూపొందించిన సాఫ్ట్వేర్. ఆర్పీఏను సంస్థల్లో ఉపయోగించే విధానం, వాటి వల్ల కలిగే ఉపయోగాలపై ఆర్పీఏ కన్సల్టెంట్లు పనిచేస్తారు. అన్నింటికీ ఒకే విధానాన్ని ఉపయోగించడం కాకుండా వివిధ సంస్థల అవసరాలను గమనించి, వాటికి అనుగుణంగా మార్గాలను సూచిస్తుంటారు.
కావాల్సిన నైపుణ్యాలు: యూఐపాత్, ఆటోమేషన్ ఎనీవేర్, బ్లూ ప్రిజమ్, ప్రాసెస్ ఆటోమేషన్, ఎస్క్యూఎల్
కావాల్సిన నైపుణ్యాలు: యూఐపాత్, ఆటోమేషన్ ఎనీవేర్, బ్లూ ప్రిజమ్, ప్రాసెస్ ఆటోమేషన్, ఎస్క్యూఎల్
కోర్సులు: పైథాన్ ఫర్ డేటా సైన్స్ ఎసెన్షియల్ ట్రెయినింగ్; ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఫౌండేషన్స్; స్క్రమ్: ద బేసిక్స్
బ్యాక్ ఎండ్ డెవలపర్
ఏదైనా వెబ్ అప్లికేషన్లో ఎవరికీ కనిపించకుండా తెర వెనక జరిగే పనిని బ్యాక్ ఎండ్ డెవలపర్ నిర్వహిస్తారు. అప్లికేషన్ ఉద్దేశం ఆధారంగా దాని రూపకల్పన ఉంటుంది. ఆకట్టుకునేలా కనిపించే ఫ్రంట్ ఎండ్‌లోకి వినియోగదారుడు ప్రవేశించడానికి పరోక్షంగా తోడ్పడేవాటిని వీళ్లు రూపొందిస్తారు.
కావాల్సిన నైపుణ్యాలు: నోడ్.జేఎస్, మాంగోడీబీ, జావాస్క్రిప్ట్, డీజేఆంగో, మైఎస్క్యూఎల్
కోర్సులు: పీహెచ్పీ: డిజైన్ పాటర్న్స్; అడ్వాన్స్డ్ పీహెచ్పీ; పైథాన్: డిజైన్ పాటర్న్స్; లర్నింగ్ ఫుల్ స్టాక్ జావాస్క్రిప్ట్ డెవలప్మెంట్: మాంగోడీబీ, నోడ్, రియాక్ట్; లర్నింగ్ స్ప్రింగ్ విత్ స్ప్రింగ్ బూట్

ఏ రంగాల్లో
* ఐటీ అండ్ సర్వీసెస్
* కంప్యూటర్ సాఫ్ట్వేర్
* ఇంటర్నెట్
* ఫైనాన్షియల్ సర్వీసెస్
* హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్
* రిసెర్చ్* ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ * అకౌంటింగ్
* మేనేజ్మెంట్ కౌన్సెలింగ్
* ఇన్ఫర్మేషన్ సర్వీసెస్
* ఈ లర్నింగ్
* ఫుడ్ అండ్ బెవరేజెస్
* మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ * డిజిటల్ మార్కెటింగ్
* టెలికమ్యూనికేషన్స్
* ఇండస్ట్రియల్ ఆటోమేషన్
* ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్
* కంప్యూటర్ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ
* అవుట్ సోర్సింగ్/ ఆఫ్ షోరింగ్.

సైట్ రిలయబిలిటీ ఇంజినీర్
సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అంశాలకు సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ విధానాన్ని జోడించడాన్ని సిస్టమ్ రిలయబిలిటీ ఇంజినీరింగ్ (ఎస్ఆర్ఈ)గా చెప్పొచ్చు. ఆప్‌ల డెవలప్మెంట్, ఆపరేషనల్ ప్రాసెస్లు సులువుగా అమలయ్యేలా చూడటం వీరి విధి. టెక్నాలజీ అవసరం రోజువారీ జీవితాల్లో పెరుగుతున్నకొద్దీ వీరికి గిరాకీ ఉంటుంది.
కావాల్సిన నైపుణ్యాలు: అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్), యాన్సిబుల్, డాకర్ ప్రొడక్ట్స్, క్యూబర్నెట్స్, జెంకిస్
కోర్సులు: దీ’వ్ప్రీ( ఫౌండేషన్స్; లర్నింగ్ యాన్సిబుల్; అడ్వాన్స్డ్ లైనక్స్: ద లైనక్స్ కర్నల్; లర్నింగ్ గో, ఫైథాన్: డిజైన్ పాటర్న్, లైనక్స్: బాష్ షెల్ అండ్ స్క్రిప్ట్స్, పైథాన్: ప్రోగ్రామింగ్ ఎఫిషియంట్లీ.

కస్టమర్ సక్సెస్ స్పెషలిస్ట్
ఏదైనా వస్తువు/ ప్రొడక్ట్కు సంబంధించి సమస్య ఎదురైనప్పుడు వినియోగదారులు సంస్థ కస్టమర్ కేర్ సర్వీస్‌ను సంప్రదిస్తుంటారు. ఆ తరహాలోనే కస్టమర్ సక్సెస్ స్పెషలిస్ట్ పని చేస్తుంటారు. సమస్య వీరి దృష్టికి వచ్చినప్పుడు దాన్ని కోర్ క్లయింట్, సంస్థల అవసరాలుగా గుర్తించి సేవలు అందిస్తారు. వీరికి సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ నైపుణ్యాలు రెండూ అవసరమవుతాయి.
కావాల్సిన నైపుణ్యాలు: కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం), టీం మేనేజ్మెంట్, కస్టమర్ రిటెన్షన్, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ (ఎస్ఏఏఎస్), అకౌంట్ మేనేజ్మెంట్
కోర్సులు: ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఫౌండేషన్స్; గివింగ్ యువర్ ఎలివేటర్ పిచ్; డెవలపింగ్ ఎగ్జిక్యూటివ్ ప్రెజెన్స్; చేంజ్ మేనేజ్మెంట్ ఫౌండేషన్స్.

ఫుల్ స్టాక్ ఇంజినీర్
ఒక అప్లికేషన్కు సంబంధించి అన్ని అంశాలు- ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ లాంగ్వేజెస్, డేటాబేస్, సర్వర్, ఏపీఐ, వర్షన్ కంట్రోలింగ్ సిస్టమ్స్‌పై పనిచేస్తారు. వీరు క్లయింట్లు, సంస్థ రెండింటి కోసం పనిచేయగలుగుతారు. మొత్తంగా సిస్టమ్ సమర్థంగా పనిచేసేలా చూస్తారు.
కావాల్సిన నైపుణ్యాలు: ఆంగ్యులర్ జేఎస్, నోడ్.జేఎస్, జావాస్క్రిప్ట్, రియాక్ట్.జేఎస్, మాంగోడీబీ
కోర్సులు: లర్నింగ్ ఫుల్ స్టాక్ జావాస్క్రిప్ట్ డెవలప్మెంట్: మాంగోడీబీ, నోడ్, రియాక్ట్; లర్నింగ్ స్ప్రింగ్ విత్ స్ప్రింగ్ బూట్; పీహెచ్పీ: డిజైన్ పాటర్న్స్; సీ++ డిజైన్ పాటర్న్స్: పార్ట్-1; లర్నింగ్ రిడక్స్

రోబోటిక్స్ ఇంజినీర్ (సాఫ్ట్వేర్)
వీరు రోబోట్ కంట్రోల్, ఆటోమేషన్ నిమిత్తం సాఫ్ట్వేర్ రూపొందిస్తారు. బిజినెస్ అవసరాలకు అనుగుణంగా ఆటోమేటిక్గా రోబోలు పనిచేసేలా చేస్తారు.
కావాల్సిన నైపుణ్యాలు: రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్పీఏ), యూఐపాత్, బ్లూ ప్రిజమ్, ఆటోమేషన్ ఎనీవేర్, రోబోటిక్స్, ఎస్క్యూఎల్
కోర్సులు: పైథాన్ ఫర్ డేటా సైన్స్ ఎసెన్షియల్ ట్రెయినింగ్; మెషిన్ లర్నింగ్ అండ్ ఏఐ ఫౌండేషన్స్: రెకమెండేషన్స్; మెషిన్ లర్నింగ్ అండ్ ఏఐ ఫౌండేషన్స్: వాల్యూ ఎస్టిమేషన్స్.

No comments:
Post a Comment