అనగనగ ఒక పట్టణంలో వ్యాపారి తన బిజినెస్ లావాదేవులను చూసుకుంటూ ఉంటాడు. ఇలా ఒక రోజున తన దగ్గర పని చేస్తున్న పని వాళ్ళని పిలిపించి తన జేబులో ఉన్న రెండు వేల రూపాయల నోటు చూపించి దీని విలువ ఎంత అని వారిని అడిగాడు . వాళ్ళు 2000 అని చెప్పారు. తర్వాత ఆ నోటు ని తీసుకోని మలిచి మలిచి ముడత చేస్తాడు. ఆ తరవాత వాళ్ళని మళ్ళి దీని విలువ ఎంత అని అడగగా వాళ్ళు రెండువేలు అని చెప్తారు. మరల వ్యాపారి ఆ నోటుని తీసుకోని మడిచి కాళ్ల కిందవేసి తొక్కేస్తాడు.ఆ తర్వాత మళ్లీ అడగగా వాళ్ళు రెండు వేలు అని చెప్పారు . ఆ పని వాళ్ళు వాళ్లలో వాళ్ళు ఏంటి ఈ వ్యాపారికి పిచ్చి పట్టిందా పైసలను ఆలా తొక్కేస్తున్నాడు అని ఈ విధంగా అనుకుంటున్నారు. ఆ సమయంలో వ్యాపారి మాట్లాడుతూ,రెండు వేల రూపాయల నోటుని మనము ఎలా చేసిన దాని విలువ తగ్గలేదు అలాగే మన మనుషుల ఙివితంలో కూడా కొన్ని సార్లు కష్టాలు ,బాధలు , ఎదురైనపుడు మనము ఎందుకు బతుకుతున్నాము అని ఆలోచన కూడా వస్తుంది. సమాజంలో ద్వేషించేవాళ్లు కొంతమంది,పొగిడే వాళ్ళు కొంతమంది , ఇలా చాల మంది చాల రకాలుగా అనుకుంటారు .ఇదే విధంగా మన మనుషుల విలువ కూడా తగ్గదు . అయినప్పటికీ మన వీటినిఅన్నిటిని జయించి జీవితంలో ముందుకు సాగడమే " సంతోషమైన జీవితం " .
No comments:
Post a Comment