FastNews

This is all Type Of News Channel Platform

Wednesday, November 4, 2020

అందరి చూపు అగ్రరాజ్యం వైపే

అమెరికాలో నిన్న జరిగిన ఎన్నికలో ఎవరికివారే గెలుపు వారిదే అంటున్నారు . దింతో పోరు రసవత్తరంగా మారబోతుంది . ట్రంప్ తన నాలుగేళ్ల పాలనలో జరిగిన అద్భుతాలు వివరించి ప్రజలను మమేకం చేసాడు. 

Wednesday, February 12, 2020

తేదీ మార్చిన ఢిల్లీ అధిపతి .....

గతంలో ఫిబ్రవరి 14వ తేదీ లవర్స్ డే నాడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయగా ఈసారి కూడా అదే రోజు చేస్తారని అందరూ భావించారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారని ప్రచారం సాగింది. కానీ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం 14వ తేదీన కాదని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఫిబ్రవరి 16వ తేదీన ముచ్చటగా మూడోసారి కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. తొలుత ఫిబ్రవరి 14న కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణం స్వీకారం చేయనున్నారని వార్తలు రాగా.. మారిన రాజకీయ పరిస్థితులతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. 2015 అ గతంలో ఫిబ్రవరి 14వ తేదీ లవర్స్ డే నాడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయగా ఈసారి కూడా అదే రోజు చేస్తారని అందరూ  సెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లతో గెలుపొంది కేజ్రీవాల్ ఫిబ్రవరి 14వ తేదీన ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడు మొత్తం 70 స్థానాల్లో ఆమ్ఆద్మీ పార్టీ 62 గెలిచి మూడో సారి అధికారం చేపట్టనుంది. మళ్లీ అదే సమయానికి ఎన్నికలు ముగియడంతో ముహూర్తం అదే భావించారు. కానీ కొన్ని కారణాల రీత్యా ముహూర్తం మార్చారు.
అయితే తన ప్రమాణస్వీకారానికి బీజేపీయేతర పక్షాలను ఆహ్వానించాలని అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఫిబ్రవరి 14వ తేదీన ప్రమాణం చేస్తే ఢిల్లీకి రాజకీయ ప్రముఖులు ఎవరూ రాలేరని అనుకున్నారు. దీంతో కొంత సమయం తీసుకుని ప్రమాణస్వీకారం చేస్తే దానికి రాజకీయ ఉద్ధండులు హాజరయ్యే అవకాశం ఉందని భావించి ముహూర్తం వాయిదా వేశారు. తన ప్రమాణ స్వీకారానికి పశ్చిమ బెంగాల్ సీఎం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ ,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ,డీఎంకే అధినేత స్టాలిన్, జేడీఎస్ అధినేత దేవెగౌడ కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ,ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ,సీపీఐ సీపీఎం అగ్రనేతలతో పాటు మరికొందరు ప్రముఖ నాయకులను ఆహ్వానించే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈ మార్పు అని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

Tuesday, February 11, 2020

ముచ్చటగా మూడోసారి హస్తిన పీఠం కైవసం

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ హాట్రిక్ విజయాన్ని అందుకుంది. వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్  - బీజేపీ వంటి జాతీయ పార్టీలను చీపురుతో ఊడ్చేసి.. ముచ్చటగా మూడోసారి  ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకుంది. సీఎం కేజ్రీవాల్  సంక్షేమ పథకాల ముందు బీజేపీ - కాంగ్రెస్ జాతీయ వరాలు పనిచేయలేదు. ఈ సంచలన విజయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ  శ్రేణులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఈ విజయంలో మసాలా దినుసులతో ఘుమ ఘుమలాడే బిర్యానీ కూడా తనవంతు పాత్రను నిర్వహించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘బిర్యానీ’ ఓ రాజకీయ ఆయుధంగా మారింది అని చెప్పాలి.సీఏఏ - ఎన్ ఆర్ సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్ బాద్ లో ఆందోళన చేస్తున్న వారికి ఆప్ ప్రభుత్వం బిర్యానీ సరఫరా చేస్తోందని బీజేపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ పార్టీ ఐటీ విభాగం హెడ్ అమిత్ మాలవియా అయితే షహీన్ బాద్లో బిర్యానీ పంచుతున్నారనడానికి ఇదే బలమైన సాక్ష్యం అంటూ కొన్ని ఫోటోలని కూడా షేర్ చేసారు.
అయితే   ఇలా బిర్యానీని ప్రతికూల ప్రచారానికి ఉపయోగించుకోవడం ఇదే మొదటి సారి కాదు. 2015లో ముంబై టెర్రరిస్టు దాడుల కేసు విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ బిర్యానీ ఆయుధంగా ఉపయోగించారు. జైల్లో టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్ కు జైలు అధికారులు బిర్యానీ పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అప్పట్లో కసబ్ కు పెరుగుతున్న మద్దతును దెబ్బతీయడానికే తాను ఆ అబద్ధపు ఆరోపణ చేశానని ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చుకున్నారు. తాజాగా మరోసారి బిర్యానీ వ్యూహం తో ముందుకొచ్చిన బీజేపీ కి ఢిల్లీ వాసులు బుద్దిచెప్పారు. ముస్లింలకు బహు పసందైన బిర్యానీని రాజకీయ ఆయుధంగా వాడినట్లయితే హిందువుల ఓట్లన్నీ తమకే పడతాయని బీజేపీ అనుకోగా అలాంటిది అక్కడ ఎమి  జరగలేదు . 

Wednesday, February 5, 2020

"సినిమా ప్రేక్షకులకు రేపు పండుగే ''

అవునండి ఫిబ్రవరి 7 ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 సినిమాలు విడుదల కాబోతున్నాయి .ముఖ్యంగా దిల్రాజు నిర్మిస్తున్న చిత్రం "జానూ " ఇది తమిళంలో '96" రిమిక్ తో తెరకెక్కుతున్నటువంటి చిత్రం ఈ సినిమా బారి అంచనాలతో విడుదల అవుతుంది దీనితో పాటు నందు నటిస్తున్నటువంటి చిత్రం ' సవారీ " ఈ  సినిమా కూడా బారి స్థాయిలోనే ఉంది. దింతో పాటు  జీవ నటించిన చిత్రం " స్టాలిన్ " , " డిగ్రీ కాలేజీ " సుడిగాలి సుధీర్ రాంప్రసాద్ గెటప్ శ్రీను చిత్రం " 3 మంకీస్ ". చూడాలి ఏ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.  

Friday, January 31, 2020

గంటలో 16 వేల కోట్లు ఎలా సంపాదించాడో తెలిస్తే షాక్ అవుతారు

టెస్లా ..... అమెరికా కేంద్రంగా నడిచే విద్యుత్ వాహనాల తయారీ సంస్థ . విద్యుత్ పరికరాలు, బల్బులు లాంటి  మార్కెట్లో కనిపిస్తుంటాయి.అలాంటి పెద్ద కంపెనికి చైర్మన్ అతడు . 
60 నిమిషాల్లో 16 వేళా కోట్లు .... షాక్ కి గురి కాకండి. ఇది విన్న స్టాక్ మార్కెట్ పరిశీలకులు కూడా టెస్లా ఓనర్ సాధించిన విజయాన్ని అభినందిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఆర్ధిక మందగమనం ఉన్న నేపథ్యంలో 12 శాతం లాభం అతనికి దక్కింది. దింతో అతడి సంపద 32 వేళా డాలర్లకు చేరింది.ఒకటేసరిగి అతడి షేర్లు స్టాక్ మార్కెట్లో విపరీతంగా పెరిగిపోయాయి. 

Wednesday, January 29, 2020

నిరుద్యోగులకు తీపికబురు చెప్పిన జగన్ సర్కార్

నిరుద్యోగులు ఎపుడెపుడు అని ఎదురు చూస్తున ప్రభుత్వ ఉద్యోగుల నియయమాకా క్యాలెండరు వచ్చే నెలలో విడుదల కానుంది. జనవరి 1 న విడుదల చేస్తామని గతంలో జగన్ చెప్పగా ... ప్రభుత్వ శాఖల నుండి వివరాలు రాకపోడంతో వాయిదా పడింది. ఈ భేటీలో  ఖాళీల భర్తీకి అఙ్గాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ,వరం రోజులో ఉద్యోగ క్యాలెండరు ను Appsc విడుదల చేయనుంది .  

హెల్మెట్ ధరించడం ఎప్పుడు మొదలైంది

ఇంగ్లాండ్ కి చెందిన ఆటగాడు డెన్నిస్ ఎమ్మెస్ తిలిసారిగా మోటార్ సైకిల్ హెల్మెట్ పెట్టుకుని గ్రౌండ్ లోకి దిగాడు. అతని తర్వాత గ్రెగ్ . హూక్స్ . ఇండియా కి చెందిన సునీల్ గవాస్కర్ ఈ హెల్మెట్ ను ధరించేవారు. 1978 లో తొలిసారిగా టెస్టులో ఆస్టేలియా క్రికెటర్ యాలోప్ హెలెంట్ ను ధరించాడు అప్పటినుండి కఠినమైన ఆసీస్ , వెస్టిండీస్ , బౌలర్ల బంతులను ఎదురుకోవడానికి హెలెమెట్లు వాడేవారు.